Monday, 16 March 2026
Swasthik News
Home / అంతర్జాతీయ వార్తలు

యూట్యూబ్ నా జీవితాన్నే మార్చేసింది.. Mr.Beast స్పెషల్ పోస్ట్

21 Feb 2026
10:55 AM
88

స్వస్తిక్ న్యూస్,అంతర్జాతీయం :- యూట్యూబ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నటువంటి "మిస్టర్ బీస్ట్" తాజాగా తన యూట్యూబ్ ప్రస్థానాన్ని గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. నా చిన్నప్పటి నుంచి ఎన్నో ఓటములు చూశాను కానీ యూట్యూబ్ ఆ ఓటములనే గెలుపును చేసింది అని భావోద్వేగానికి గురయ్యారు. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం 468 మిలియన్ల సబ్స్క్రైబర్లతో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ గా నిలిచింది.

Article Image

 ఒక యూట్యూబర్ గా మిస్టర్ బీస్ట్ ఎన్నో రికార్డులు సృష్టించారు. తాజాగా తన యూట్యూబ్ ను స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క యువత లోను ఒక స్ఫూర్తిని నింపే పోస్ట్ చేశారు. మొదటిలో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తన వీడియోలు ఎవరు కూడా చూడలేదు అని.. ప్రతి ఒక్కరు కూడా తనను హేళన చేసినట్లు తెలిపారు. ఇక మొదటిలో అయితే youtube వీడియోలు చేస్తూ పని పాట లేకుండా సమయం వృధా చేసుకోకు అని చాలామంది విమర్శించారని గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది తిట్టినా ఇంకా ఎంతోమంది నచ్చ చెప్పిన కూడా వినకుండా పట్టుదలతో ఈరోజు ఇలా నిలబడ్డాలంటే దానికి కారణం యూట్యూబ్ అని పేర్కొన్నారు.

Article Image

ఇప్పటివరకు మిస్టర్ బీస్ట్ ఛానల్ కు పదకొండు వేల కోట్ల వ్యూస్ రావడం అనేది కూడా ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఈరోజు మిస్టర్ బీస్ట్ ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. 2012 ఫిబ్రవరి 19వ తేదీన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. నిన్నటితో సరిగ్గా 14 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. ఈ తరుణంలోనే మిస్టర్ బీస్ట్  చేసిన ఈ ఆసక్తికరమైన పోస్టులను ప్రతి ఒక్కరు కూడా చదివి ఎమోషనల్ అవుతున్నారు.

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!