Monday, 16 March 2026
Swasthik News
Home / రాజకీయం

నందీశ్వర ఆలయ పున:ప్రతిష్ట లో పాల్గొన్న వైయస్ జగన్

25 Feb 2026
12:27 PM
278

స్వస్తిక్ న్యూస్, రాజకీయం :- వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం లోని నందిపల్లి గ్రామంలో పర్యటించారు. నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయం పున ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన జగన్.. ప్రత్యేక పూజలు చేసి అనంతరం హోమంలో పాల్గొన్నారు. దాదాపు 6 కోట్ల రూపాయలతో ఈ నందీశ్వర ఆలయాన్ని ఈ గ్రామంలో పునరుద్ధరించారు. ఐదు ఎకరాల స్థలంలో పూర్తిగా గ్రానైట్ రాయితో ఈ గుడిని నిర్మించారు అని ఆలయ అధికారులు తెలిపారు. పులివెందులకు చేరుకోగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!