Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

"తమ్మడపల్లి" గ్రామంలో YSRCP పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం

14 Feb 2026
08:36 AM
67

స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :- వైస్సార్సీపీ కార్యకర్తల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న యర్రగొండపాలెం శాసనసభ్యులు ,వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆదేశాలు మేరకు గ్రామస్థాయిలో వైస్సార్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయుటకు..గ్రామ కమిటీల నియామక కార్యక్రమంలో భాగంగా ఈరోజు యర్రగొండపాలెం మండలం పరిధిలోని తమ్మడపల్లి పంచాయతీ గ్రామంలో వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 

Article Image

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి,గ్రామస్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టే విధంగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని,గ్రామస్థాయి నుంచి ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Article Image

అదే విధంగా తమ్మడపల్లి గ్రామ పంచాయతీ కి సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నిర్మాణాన్ని వివరించారు.పార్టీ ని మరింత పటిష్టం చేస్తూ,భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో యర్రగొండపాలెం మండల వైస్సార్సీపీ నాయకులు మరియు తమ్మడపల్లి గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!