Monday, 16 March 2026
Swasthik News
Home / క్రీడలు

బంగ్లాదేశ్ మాట వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందా..?

23 Jan 2026
10:09 AM
158

Sports News :-  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేస్తుంది. వచ్చే నెలలో T20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ భారతదేశంలో జరగబోయేటువంటి మ్యాచ్ల వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది. అయితే చాలామంది వినతులను స్వీకరించిన తర్వాత ఐసిసి ముక్కు సూటిగా ఎటువంటి మార్పులు చేసేది లేదు అని తేల్చి చెప్పింది. కానీ మరోవైపు అంతే ముక్కు సూటిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా టి20 వరల్డ్ కప్ మ్యాచ్లు భారత దేశంలో ఆడేది లేదు అని ముక్కు సూటిగా చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆ విధంగా చెప్పడాన్ని ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ మ్యాచ్లు ఇండియాలో ఆడాల్సిందే అని ఐసీసీ చెప్పిన కూడా వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఏమైనా ఉందా అన్న కోణంలో ఆలోచనలు మొదలుపెట్టారు. ఒకవేళ రేపు జరగబోయేటువంటి విచారణలో ఈ విషయం నిజమని తేలితే మాత్రం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సస్పెండ్ చేయాలని ఐసీసీ ఆలోచిస్తున్నట్లుగా క్రీడా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరి నెల 7వ తేదీ నుంచి ఈ T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అతి త్వరగా ఈ విషయాన్ని ముగించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ జట్టును తొలగిస్తే ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

https://www.swasthiknews.com/news/why-the-hatred-for-dumb-creatures--351

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!